చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమిళం నేర్చుకుంటానన్న రోశయ్య : గవర్నర్‌గా ప్రమాణం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rossaiah
చెన్నై: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య బుధవారం సాయంత్రం తమిళనాడు గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం జయలలిత రోశయ్యకు అభినందనలు తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇక్భాల్ రోశయ్యచే ప్రమాణ స్వీకారం చేయించారు. మన రాష్ట్రం నుండి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పార్లమెంటు సభ్యులు సుబ్బిరామిరెడ్డి, మంత్రులు పితాని సత్యనారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, శంకర్ రావు, కాంగ్రెసు నేతలు జెడి శీలం, ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, కెవిపి రామచంద్రా రావు, టిడిపి నేత నన్నపనేని రాజకుమారి, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి, విజయ్ కాంత్, పి సుశీల తదితరులు పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం రోశయ్య మాట్లాడారు. తాను త్వరలో తమిళం నేర్చుకుంటానని చెప్పారు. తమిళ ప్రజలతో తమిళంలోనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తానన్నారు. రాజ్యాంగానికి అనుగుణంగా, చట్టబద్దంగా నడుచుకుంటానని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్‌కు, తమిళనాడుకు ఎనలేని బంధం ఉందన్నారు. తమిళనాడు సర్వతోముఖాభివృద్ధికు కృషి చేస్తానని చెప్పారు. కాగా రోశయ్య తమిళనాడుకు 22వ గవర్నర్. మరో విషయమేమంటే తమిళనాడుకు ఇప్పటి వరకు ముగ్గురు తెలుగు వారు గవర్నర్లుగా పని చేశారు. ముగ్గురూ జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.

English summary
Rosaiah swears in as Tamilnadu Governor today evening in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X