బంగారం ధరల పతనాన్ని శాసిస్తోన్న తాజా పరిణామాలు

దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. పశ్చిమ ఆసియాలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు వీటి పతనాన్ని శాసిస్తోన్నాయి. పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికన్ డాలర్ విలువలో చోటుచేసుకున్న హెచ్చుతగ్గులు పసిడి ధరలను ప్రభావితం చేస్తోన్నాయి. దీనివల్ల సాధారణంగా సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి, వెండి ధరలు భారీగా పుంజుకోవట్లేదు. స్థిరమైన డిమాండ్ మధ్య ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

ప్రస్తుత రిటైల్ మార్కెట్ ట్రెండ్స్ పరిశీలిస్తే.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు సుమారు రూ. 1,54,720, 22 క్యారెట్లు దాదాపు రూ. 1,39,990 వద్ద ట్రేడవుతోంది. స్థానిక పన్నులు, రవాణా వ్యయాలు, ఆయా నగరాల్లోని జ్యువెలర్స్ నిర్ణయించే మార్జిన్ల కారణంగా ఈ ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,55,090 ఉండగా ముంబై, కోల్‌కతాలో రూ. 1,52,720, చెన్నైలో రూ. 1,54,900గా నమోదైంది.

Gold Tanks at MCX in India as 24K Hits 152720 per 10gram and 22K at 139990 Amid Geopolitical Tensions

వెండి ధర కిలోకు రూ. 2,64,900 వద్ద కొనసాగుతోంది. గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలోని అనిశ్చితి కారణంగా, ఆర్థిక పరిస్థితులు మారినప్పుడు బంగారం కంటే వెండి ధరలు మరింత వేగంగా హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో కిలో గ్రాముల వెండి ధర రూ. 2,64,900 ఉండగా, చెన్నైలో రూ. 2,69,900గా ఉంది.

భారత్ లో బంగారం ధరలను ప్రధానంగా అంతర్జాతీయ బులియన్ మార్కెట్ సరళి, రూపాయి-డాలర్ మారకం రేటు, దిగుమతి సుంకాలు, సీజనల్ డిమాండ్ నిర్ణయిస్తాయి. రాబోయే కాలంలో ప్రపంచ స్థాయి భౌగోళిక రాజకీయ పరిణామాలు, స్థూల ఆర్థిక సంకేతాలు, కరెన్సీ హెచ్చుతగ్గుల ఆధారంగానే పసిడి, వెండి ధరల తదుపరి గమనం ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి మదుపరులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,349, 22 క్యారెట్లు - రూ. 14,070, 18 క్యారెట్లు - రూ. 11,795

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,169, 22 క్యారెట్లు- రూ. 13,095, 18 క్యారెట్లు - రూ. 11,377

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,169, 22 క్యారెట్లు- రూ. 13,095, 18 క్యారెట్లు - రూ. 11,377

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,169, 22 క్యారెట్లు- రూ. 13,095, 18 క్యారెట్లు - రూ. 11,377

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,169, 22 క్యారెట్లు- రూ. 13,095, 18 క్యారెట్లు - రూ. 11,377

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,169, 22 క్యారెట్లు- రూ. 13,095, 18 క్యారెట్లు - రూ. 11,377

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+