మీ అభిమానిగా అడుగుతున్నా.. సమాధానం చెప్పాలి- పవన్ లక్ష్యంగా రాహుల్..!!

నటుడు రాహుల్ రామకృష్ణ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రాహుల్ గతంలోనూ పలు వివాదాస్పద పోస్టింగ్స్ చేసారు. ఆ సమయంలో ఇక ట్వీట్లు చేయనని ప్రకటించారు. కాగా, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. అభిమానిగా మాత్రమే అడుగుతున్నానని.. సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసారు. ట్వీట్లు చేస్తూనే జై తెలంగాణ అంటూ నినదించారు. ఇప్పుడు ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

నటుడు రాహుల్ రామకృష్ణ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను ఉద్దేశించి ట్వీట్ చేసారు. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు. తన ట్వీట్ లో.. "మీ గొప్పలు పక్కన పెడితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు నిర్వహించే శాఖల్లోని ప్రతీ విభాగంలో సమాచార బహిర్గతానికి సంబంధించి సెక్షన్ 4.1 (బి) అమలు చేశారా సార్?' అని ప్రశ్నించారు.

Actor Rahul Ramakrishna Tweet over question for Pawan Kalyan on PESA Act goes viral

అలాగే, 'PESA, 1/70 గ్రామ సభ చట్టం అమలుకు సంబంధించి ఫలితాలను దయచేసి అడిగి చూపించండి. అటవీకరణ కార్యక్రమాలు మీరు చేశారా? ఓ స్వతంత్ర సంస్థ కన్ఫర్మ్ చేసిన లెక్కల ప్రకారం అనుమానాస్పదం గా ఉన్నాయి. నేను దాఖలు చేసి గుర్తించిన ఫలితాలను అడుగుతున్నా.' అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ప్రశ్నించినందుకు నేను దేశద్రోహిని కాదు. జై తెలంగాణ' అని ట్వీట్ చేశారు.

గతంలో కొన్ని పోస్టింగ్స్ వివాదాస్పదం కావటంతో.. తాను సోషల్ మీడియా నుంచి వెళ్లిపోతున్నట్లు ప్రకటించిన రాహుల్ రామకృష్ణ.. ఆ తర్వాత అడపాదడపా తన పోస్టులతో వైరల్‌గా మారుతూనే ఉన్నారు. ఆ తర్వాత మరో ట్వీట్ చేసిన రాహుల్ రామకృష్ణ.. వీటితోపాటు మీరు సాధారణంగా చేసే ఆర్భాటాలు పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్ నిర్వహించే ప్రతీ పదవిలోని ప్రతీ విభాగంలో సమాచార హక్కు చట్టంలోని క్రియాశీల సమాచారాన్ని బహిర్గతం చేయడానికి సంబంధించిన సెక్షన్ 4.1(బి)ని అమలు చేశారా అని ప్రశ్నించారు.

తాను పవన్ కళ్యాణ్ అభిమానిని కాబట్టే అడుగుతున్నానని చెప్పుకొచ్చారు. తాజాగా తెలంగాణలో కొందరు పవన్ ను లక్ష్యంగా చేసుకొని చేసిన విమర్శలు.. పవన్ సమాధానం తరువాత ఇంకా కౌంటర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలోనే ఇప్పుడు రాహుల్ చేసిన ట్వీట్ మరింత చర్చగా మారింది. ఈ ట్వీట్ పైన భిన్న రకాల స్పందన కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+