కాంగ్రెసు ప్రభుత్వం వైయస్ పుణ్యమే: పిల్లి సుభాష్

సిబిఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో వైయస్ రాజశేఖర రెడ్డిని తప్పు పట్టారని, అయినా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని ఆయన విమర్శించారు. వైయస్‌ను తమ నాయకుడిగా చెప్పుకుంటున్న కాంగ్రెసు నాయకులు సిబిఐ ఎఫ్ఐఆర్‌పై కోర్టులో ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ఆయన అడిగారు. వైయస్ రాజశేఖర రెడ్డిని ఎవరు కించపరుస్తున్నారో ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు.
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి బొమ్మ వల్లనే కాంగ్రెసు పార్టీకి 150 సీట్లు వచ్చాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు విశ్వేశ్వర రావు అన్నారు. వైయస్‌కు సహాయం అందించే మంచి నాయకులు ఉండి ఉంటే మిగతా సీట్లు కూడా కాంగ్రెసుకు వచ్చి ఉండేవని ఆయన గురువారం విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. నాయకులు కుట్రలు, కుతంత్రాలు చేయడం వల్లనే మిగతా సీట్లు ఓడిపోయామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
