పార్టీలో ఉంటారో వెళ్తారో ఆయనే చెప్పాలి: వివేకాపై డిఎల్

వైయస్ పదవిని అడ్డు పెట్టుకొని వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎలా సంపాదించారనే విషయం పైనే విచారణ జరుగుతుందన్నారు. జగన్ ఆస్తులపై ఆరోపణలు వచ్చినందునే సిబిఐ విచారణ జరుగుతోందన్నారు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ నిజాయితీ గల అధికారి అన్నారు. ఆయనపై వివేకానంద రెడ్డి విమర్శలు అర్థం లేనివన్నారు. పార్టీలో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నష్టం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్తులు ప్రకటించడం మంచిదే అన్నారు.












Click it and Unblock the Notifications