చిరు నమ్ముకున్నారు జగన్ అమ్ముకున్నారు!: లగడపాటి

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సైతం జగన్‌పై బౌన్సర్లు వేశారు. వ్యోక్స్ వ్యాగన్ విషయంలో తనపై ఆరోపణలు వచ్చినప్పుడు బయట తిరగడానికి తనకు ముఖం చెల్లలేదన్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు తిరగడానికి సిగ్గుపడ్డానన్నారు. అదే జగన్ మాత్రం దర్జాగా తలెత్తుకు తిరుగుతున్నాడన్నారు. అలా ఎలా తిరగగలుగుతున్నాడో అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి తామే నిజమైన వారసులం అని ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెసుకు ఖచ్చితమైన, స్పష్టమైన కార్యాచరణ ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిజాలు ఎప్పుడూ చెప్పరన్నారు.












Click it and Unblock the Notifications