హైటెక్ సిటీలో బోర్డు తిప్పేసిన ప్రోడ్జి సాఫ్టువేర్ సంస్థ

బాధితులు ఉద్యోగంలో చేరేటప్పుడు ష్యూరిటీ పేరిట ఒక్కో ఉద్యోగి నుండి రూ.50వేల నుండి లక్ష రూపాయల వరకు సంస్థ తీసుకుంది. మొత్తం సుమారు రూ20 కోట్లు సేకరించినట్లుగా తెలుస్తోంది. బాధితుల ఒరిజినల్ సర్టిఫికేట్లు కూడా సంస్థ వద్దే ఉన్నాయి. బాధితులకు మూడు నెలలుగా జీతాలు కూడా చెల్లించట్లేదు. బిటెక్, ఎంటెక్ చేసిన వారికి ప్లేస్ మెంట్ పేరిట ఉద్యోగాలు ఎరవేసి డబ్బులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల సంస్థ తన ఉద్యోగులను పిలిపించి సంస్థ నష్టాల్లో ఉందని జీతాలు చెల్లించలేని స్థితిలో ఉందని చెప్పినట్లుగా సమాచారం. బాధితులు మాదాపూర్ పోలీసు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications