వైయస్ జగన్ పక్షులు కాంగ్రెసులోకి: శంకర రావు

P Shankar Rao
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట వెళుతున్న కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు తిరిగి కాంగ్రెసు గూటికే వస్తారని చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర రావు శనివారం అన్నారు. గతంలో కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వెళ్లిన వారు జీరోలు అయ్యారని తిరిగి కాంగ్రెసులోకి వచ్చాక మాత్రం హీరోలయ్యారన్నారు. కాంగ్రెసు పార్టీలో గ్రూపు రాజకీయాలు ఉండవన్నారు. అంతా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీదే అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి పదవులన్నీ కాంగ్రెసు పార్టీ వల్లనే వచ్చాయన్నారు.

అవినీతికి రాజముద్రలు వేసిన వారు సిబిఐని ప్రశ్నించే అర్హత లేదన్నారు. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి వ్యాఖ్యలు అవివేకంగా ఉన్నాయన్నారు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ జెడి లక్ష్మీ నారాయణ నిజాయితీపరుడన్నారు. జగన్ ఆస్తులపై కోర్టు ఆదేశాల మేరకే విచారణ జరుగుతుందన్నారు. వైయస్సార్ వర్దంతి రోజున పేపర్ ప్రకటన ఇవ్వక పోవడం బాధ కలిగించిందన్నారు. అయినా ఇదంతా పవర్ గేమ్ అన్నారు. జగన్ వర్గం రాజీనామాలు ఆమోదించిన పక్షంలో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఉప ఎన్నికల ప్రచారానికి కడప వెళతానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+