అన్నాహజారే బృందానికి కేంద్రం షాక్ మీద షాక్

14వ తేది లోగా సమాధానం చెప్పాలని ప్రశాంత్ భూషణ్‌ను రాజ్య సభ సెక్రటరియేట్ కోరింది. ఎంపీలను కించపర్చే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఎంపీ మహ్మద్ అబీబ్ ఇచ్చిన నోటీసు ప్రకారం నోటీసులు జారీ అయ్యాయి. అన్నా బృందంలోని కేజ్రీవాల్‌కు ఆదాయపన్ను శాఖ నోటీసులు పంపించింది. కాగా కేంద్రం అవినీతిపై అన్నాకు సహకరించిన అందరిపై ఒక్కొక్కరిగా టార్గెట్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. కాగా గతంలో విదేశాల్లోని నల్లడబ్బు వెనక్కి రప్పించాలని ఉద్యమించిన బాబా రామ్‌దేవ్ ఆస్తుల పైనా ఈడి దర్యాఫ్తుకు సిద్ధపడిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications