జగన్ బాబాయి వివేకానందకి కోపమొచ్చింది!

వైఎస్ ప్రతిష్ఠను దిగజార్చాలని చూస్తే ఊరుకోవాల్సిన అవసరం లేదని హెచ్చరించారు. సిబిఐ డ్రామాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా సిబిఐ జెడి పైనా విమర్శలు గుప్పించారు. జెడి లక్ష్మీనారాయణ టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బావమరిదన్నార. లక్ష్మీనారాయణ పెద్ద లంచగొండి. ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ పెద్దలు వైఎస్ కాంగ్రెస్‌కే దక్కాలని వైఎస్ ద్వారా పార్టీకి మేలు జరగాలని అంటుంటే ఇక్కడి కాంగ్రెస్ నాయకులు కుట్ర చేస్తున్నారని రాష్ట్రంలోని సొంత పార్టీ నేతలపైనా విమర్శలు గుప్పించారు. వారి తీరును అధిష్టానం దృష్టికి తీసుకు వెళతానని చెప్పారు.
అప్పటికీ పట్టించుకోకపోతే కాంగ్రెస్‌లోనే ఉంటూ వైఎస్ భావజాలంతో ఏకీభవించే వారితో గ్రూపు కడతానని సంచనల వ్యాఖ్యలు చేశారు. వైయస్ ఆశయ సాధన కోసమే పాదయాత్ర చేశానన్నారు. పిసిసి చీఫ్ బొత్స వ్యాఖ్యలపైనా ఆయన మండి పడ్డారు. వైయస్ ఎప్పుడూ కాంగ్రెసు అంటుండే వారన్నారు. రాష్ట్రంలో ఎవరికీ జరగనంతగా మా కుటుంబంలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. మహా నేత ప్రతిష్ఠను ఎవరూ దెబ్బతీయలేరు. అధిష్ఠానం వైఎస్‌కు క్లీన్‌చిట్ ఇస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications