జగన్‌ను అందుకే విమర్శించట్లేదు: ఎర్రన్నాయుడు

Yerram Naidu
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జాతీయ కాంగ్రెసు నేతలు ఎలాంటి విమర్శలు చేయక పోవడం వెనుక జగన్ తిరిగి కాంగ్రెసులోకి వస్తాడనే ఉద్దేశ్యంతోనే అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు శనివారం అనుమానం వ్యక్తం చేశారు. జగన్ విషయంలో ముందు కాంగ్రెసు అధిష్టానం తన నిర్ణయం చెప్పాలని డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాష్ట్రంలో జరిగిన లూటీ వెనుక జాతీయస్థాయి నేతల పాత్ర ఉండి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

కాంగ్రెసు, జగన్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది కాబట్టే వైయస్సార్ విషయంలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. వైయస్ హయాంలో అధికార దుర్వినియోగం జరిగిందన్నారు. జగన్ తాను ఏ తప్పు చేయలేదనుకుంటే సిబిఐ దర్యాఫ్తుకు సహకరించి కోర్టు నుండి క్లీన్ చీట్ తెచ్చుకోవాలని సవాల్ చేశారు. కాంగ్రెసుకు అధికారం తప్ప విలువలుండవని విమర్శించారు. వైయస్ వివేకానంద రెడ్డి వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ఆయన మానసిక ఆందోళనలో ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు.

ఓ వైపు జగన్ ఆస్తులపై సిబిఐ విచారణ జరుగుతుంటే రాష్ట్ర కాంగ్రెసు నేతలు కెవిపి రామచంద్ర రావు రూపొందించిన పుస్తకావిష్కరణ సభకు ఎలా వెళ్లారని మరో నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. వైయస్ వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీ పదవి కోసమే కాంగ్రెసుపై విమర్శలు గుప్పిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మరో నేత ఆరోపించారు. ఆయన మానసిగ ఆందోళనలో ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+