వైయస్ జగన్ నుండి ఎమ్మెల్యేలకు పిలుపు

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం ఉదయం రాజీనామాలు చేసిన తన వర్గం శాసనసభ్యులతో భేటీ కానున్నారు. ఈ మేరకు రాజీనామా చేసిన 29 మంది శాసనసభ్యులు హైదరాబాద్ రావాలని ఆహ్వానం పంపించారు. ఎమ్మెల్యేలతో పాటు పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులను సైతం ఆహ్వానించారు. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలందరితో వివిధ కారణాల వల్ల జగన్ ఇప్పటి వరకు సమావేశం కాలేదు. ఇటీవల ఎమ్మెల్యేలతో సమావేశమైనప్పటికీ కొందరు మాత్రమే హాజరయ్యారు. ఈసారి అందరూ రావాలని ఆహ్వానించారు. ఈ సమావేశంలో తన ఆస్తులపై సిబిఐ విచారణ, ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ తదితర అంశాలను చర్చించున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ సమావేశం ప్రధానంగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఎవరూ కాంగ్రెసు వైపు వెళ్లరని చెప్పడానికే ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, శంకర్ రావు తదితర కాంగ్రెసు నేతలు జగన్ వర్గంలోని పదిమంది ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెసులోకి వస్తారనే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎవరూ కాంగ్రెసు వైపు వెళ్లేందుకు సిద్ధంగా లేరని ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా రాజీనామాలు చేయని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సైతం సమావేశానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తద్వారా తన బలం పెరుగుతుందే కానీ తరగడం లేదని చెప్పే ప్రయత్నం జగన్ చేస్తున్నట్టుగా సమాచారం. కాగా సోమవారం జగన్ న్యూఢిల్లీ వెళుతున్న విషయం తెలిసిందే. తనపై రాజకీయ కక్షతోనే సిబిఐ విచారణ జరుగుతోందని జాతీయస్థాయి ప్రతిపక్ష పార్టీలకు జగన్ వారికి చెప్పనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+