జగన్‌కు బాబు ఢిల్లీ తలుపులు మూసేశారా?

ఇక బిజెపి విషయానికి వస్తే కక్కలేక మింగలేక అనే పరిస్థితిలో చిక్కుకుంది. పార్లమెంటులో బిజెపి నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ జగన్‌కు మద్దతిస్తున్నట్లుగా మాట్లాడి నిప్పు రాజేశారు. కొంత మేరకు వైయస్ జగన్‌కు అది నైతిక బలాన్ని ఇచ్చింది. అయితే, దాంతో రాష్ట్రంలో బిజెపి చిక్కుల్లో పడాల్సి వస్తుంది. సిబిఐ దర్యాప్తును వ్యతిరేకిస్తున్నారంటే, జగన్‌ను అవినీతిని సమర్థిస్తున్నారనే కన్నా సిబిఐ దర్యాప్తు జరిపితే తప్పేమిటనే ప్రశ్న బయలుదేరింది. దీంతో రాష్ట్రానికి చెందిన బిజెపి నాయకులు ఒక్కసారిగా వరుస పెట్టి ప్రకటనలు ఇచ్చారు. పార్లమెంటు సభ్యుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు, సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి జగన్‌తో తమకు సంబంధం లేదంటూ మాట్లాడారు. సిబిఐ దర్యాప్తును సమర్థిస్తూ మాట్లాడారు. ఈ రకంగా జాతీయ స్థాయిలో జగన్‌కు మద్దతు దొరకని పరిస్థితిని చంద్రబాబు సృష్టించి పెట్టారని అంటున్నారు.












Click it and Unblock the Notifications