గాలి అరెస్టుతో జగన్‌కు లంకె పెడుతున్న నేతలు

V Hanumanth Rao-DL Ravindra Reddy
హైదరాబాద్‌: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అరెస్టుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి లంకె పెడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని అధికార, ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు. వైయస్ జగన్ విషయంలో కూడా అదే జరుగుతుందని వారు నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. అధికారం ఉంది కదాని విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలకు పాల్పడే వారికి గాలి జనార్దన్‌రెడ్డి అరెస్టు ఓ గుణపాఠమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. గత ప్రభుత్వ పెద్దల అండదండలతో రాష్ట్రంలోని ఓబుళాపురం, రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో బినామీ పేర్లతో గనులను దోచుకున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.దుయ్యబట్టారు. సీబీఐ విచారణను రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారని జగన్‌ వర్గీయులు వ్యాఖ్యానించడం అవినీతికి చట్టబద్ధత కోరే విధంగా ఉందని విమర్శించారు. రాబోయే కాలంలో పెద్దలు చేసిన పాపాలకు మరిన్ని అరెస్టులు తప్పవని డీఎల్‌ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యానించారు.

గాలి జనార్దనరెడ్డి అరెస్టుపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు హర్షం వ్యక్తం చేశారు. దీంతోపాటు ఆయన ఆక్రమ ఆస్తులను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన సోమవారం కర్నూలు జిల్లా పత్తికొండలో మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్‌ చేశారు. పార్టీ నూతన కార్యాలయం 'ఈశ్వరరెడ్డి భవన్‌'ను ఆయన ప్రారంభించారు. అవినీతి నిర్మూలనకు ప్రజలంతా సహకరిస్తే ఆ భూతాన్ని తరిమికొట్టటం సాధ్యమని అన్నారు.

గాలి జనార్దన్‌రెడ్డి అరెస్టుతో ఓబుళాపురం గనుల అక్రమాలపై తన వాదన నిజమైందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌నేత వి.హనుమంతరావు అన్నారు. ఈ విషయంలో జగన్‌ ఇప్పటికైనా తప్పు ఒప్పుకోవాలని ఆయన సోమవారం ఢిల్లీలో అన్నారు. గనుల తవ్వకాల ద్వారా వేల కోట్లు ఆర్జించి ప్రభుత్వాలను శాసించే స్థాయికి జనార్దన్‌రెడ్డి ఎదిగారని, సీబీఐ సరైన సమయంలో సమర్థంగా పనిచేస్తోందన్నారు. భవిష్యత్తులో అక్రమ గనుల తవ్వకాలు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. బయ్యారం అక్రమ తవ్వకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేయాలని వీహెచ్‌ అన్నారు. లేకపోతే ప్రభుత్వం అప్రతిష్ఠ పాలవుతుందన్నారు.

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డి అరెస్టు మంచి పరిణామమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఇలాంటి వారి ఆస్తులను జప్తు చేయాలని పేర్కొన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న గనుల మాఫియాను బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. కర్ణాటకలో తీగ లాగితే, ఆంధ్ర ప్రదేశ్‌లో డొంక కదులుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+