ములాయంతో జగన్ భేటీ, కాంగ్రెసుపై ఒత్తిడికేనా?

కాంగ్రెసు అధిష్టానంపై ఒత్తిడి తేవడానికా, కాంగ్రెసుతో రాజీ పడడానికా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు కావడం జగన్‌కు పెద్ద షాక్ వంటిదే. తనను కూడా సిబిఐ అరెస్టు చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు అవసరమైన మార్గాలను జగన్ అన్వేషిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా, జగన్ సోమవారం ఉదయం హైదరాబాదు పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీతో సమావేశమయ్యారు. పార్లమెంటు సభ్యులు దీపీందర్ సింగ్, అఖిలేష్ సింగ్‌లతో కూడా ఆయన సమావేశమయ్యారు.
ములాయం సింగ్ యాదవ్, అసదుద్దీన్ ఓవైసీలు కాంగ్రెసు పార్టీకి సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ నేపథ్యంలో వారు కాంగ్రెసుతో రాయబారాలు చేస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సోమవారం ఉదయం మీడియా ప్రతినిధుల వద్ద జగన్ కాంగ్రెసుపై అంత ఘాటుగా విమర్శలు చేయలేదు. తాను బిజెపి నేత సుష్మా స్వరాజ్‌నే కాదు, ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కూడా కలుస్తానని ఆయన చెప్పారు. జగన్ తన భేటీల ద్వారా ఏ విధమైన ఫలితాన్ని ఆశిస్తున్నారనేది అర్థం కావడం లేదు. సిబిఐ దర్యాప్తును ఆపించడం ఈ దశలో సాధ్యమవుతుందా అనేది సందేహమే. అయితే, అది అరెస్టు దాకా వెళ్లకుండా ఆయన జాగ్రత్త పడతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications