సాగర్ వరద ఉధృతి: పులిచింతలకు భారీ వరద

ప్రకాశం బ్యారేజి వద్ద కూడా నీటి వరద పెరుగుతుండటంతో 70 గేట్లు ఎత్తి 1.54 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజి వద్ద ప్రస్తుత నీటి మట్టం 12.5 అడుగులుగా ఉంది. కృష్ణా జిల్లాలోనూ నీటి ఉధృతి కారణంగా పలు గ్రామాలు నీటిలో మునిగి పోయాయి. తొట్లవల్లూరు, లంగ గ్రామాలు జలదిగ్బంధంలో మునిగాయి. వందల ఎకరాల పంట సైతం నీట మునిగింది. నాగార్జున సాగర్‌కు భారీ వరద నీరు వచ్చి చేరటంతో మూడు రోజుల క్రితమే మంత్రులు నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications