కొత్త తెలంగాణ పార్టీతో కెసిఆర్‌కు నాగం షాక్?

తొలుత వేదికను ఏర్పాటు చేస్తామని నాగం జనార్దన్ రెడ్డి అంటున్నారు. ఆ తర్వాత అవసరమైతే పార్టీని ఏర్పాటు చేస్తామని ఆయన చెబుతున్నారు. మొత్తం మీద, పార్టీ పెట్టే ఆలోచన మాత్రం నాగం బృందానికి ఉందనేది అర్థమవుతోంది. వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట నడవడానికి నాగం జనార్దన్ రెడ్డి సిద్ధపడ్డారని, అందులో భాగంగానే తమ నేత చంద్రబాబును విమర్సిస్తున్నారని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు అంటున్నారు. అయితే, తెలంగాణకు అనుకూలంగా వైఖరి ప్రకటించని జగన్‌తో ఇంత దాకా వచ్చి నాగం జనార్దన్ రెడ్డి నడవడం సాధ్యమం కాదనే మాట వినిపిస్తోంది. పైగా, జగన్ సిబిఐ దర్యాప్తుతో తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు.
తెలంగాణలోనే ఓ వర్గం కెసిఆర్‌కు దీటుగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే సన్నాహాల్లో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఆ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి కాకుండా మరో నాయకుడు నాయత్వం వహించే అవకాశాలున్నాయని అంటున్నారు. దాని కోసమే నాగం జనార్దన్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ముందుకు వస్తారని అప్పట్లో ప్రచారం సాగింది. కాగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేసిన ఓ ప్రముఖ వ్యక్తి పేరు కూడా వినిపిస్తోంది. అయితే, నాగం జనార్దన్ రెడ్డి మాత్రం గుప్పిట విప్పడం లేదు. అయితే, తెరాసలో చేరితే కెసిఆర్ నామమాత్రం అయిపోతామనే భయం కూడా నాగం జనార్దన్ రెడ్డిని కొత్త పార్టీ వైపు నడిపిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications