అలాంటి వాళ్లం కాదు: జగన్‌కు ప్రధాని మన్మోహన్ క్లాస్

Manmohan Singh
న్యూఢిల్లీ: తనను కలిసిన వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీ తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, అందులో భాగంగానే తన ఆస్తులపై సిబిఐ దాడులని జగన్ ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. సిబిఐని దుర్వినియోగం చేయవద్దని ప్రధానిని జగన్ కోరారు. ఆయన వ్యాఖ్యలకు ప్రధాని ధీటుగా స్పందించినట్లుగా తెలుస్తోంది. చట్టం తన పని తాను చేసుకు పోతుందని ఏవైనా అభ్యంతరాలు, సమాధానాలు ఉంటే సిబిఐకి చెప్పుకోవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. తాము కక్ష సాధించే వాళ్లం కాదని చెప్పినట్లు తెలుస్తోంది.

కాగా నాలుగు రోజులుగా ఢిల్లీలో ఉన్న జగన్‌కు గురువారం ప్రధాని అపాయింట్‌మెంట్ దొరికింది. మధ్యాహ్నం ప్రధానితో భేటీ అయ్యారు. సిబిఐ అంశంతో పాటు రాష్ట్రంలోని పలు సమస్యలను ప్రధాని దృష్టికి జగన్ తీసుకు వెళ్లారు. రాష్ట్రంలోని పంట విరామం, రైతు సమస్యలపై ప్రధానికి జగన్ రెండు పేజీల వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారానికి తక్షణమే చొరవ చూపాలని కోరారు. సాగు సమ్మె, ఎరువుల కొరత, మద్దతు ధర దక్కక పోవడాన్ని ప్రధాని వద్ద ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన ఇన్ పుట్ సబ్సిడీ ఇప్పటికీ రైతులకు అందలేదని చెప్పారు. ప్రాణహిత - చేవెళ్ల, ప్రాణహిత ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తిస్తూ నిధులు అందజేయాలని కోరారు. కాగా అంతకుముందు జగన్ ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+