వైయస్ జగన్‌కు ముఖం చాటేసిన సుష్మా స్వరాజ్

తమ పార్టీకి చెందిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అరెస్టుతోనే బిజెపి నాయకత్వం కక్కలేని మింగలేని పరిస్థితిలో పడింది. గాలి జనార్దన్ రెడ్డి సుష్మా స్వరాజ్‌కు దగ్గర అనే వార్తలు వచ్చాయి. గాలి జనార్దన్ రెడ్డి సుష్మా స్వరాజ్ తమ తల్లిగా కూడా చెప్పుకున్నారు. దాంతో ఆమె తీవ్ర విమర్శల పాలయ్యారు. గాలి జనార్దన్ రెడ్డి సోదరులతో తనకు సంబంధం లేదని చెప్పుకోవడానికి ఆమె తీవ్రంగా తంటాలు పడాల్సి వచ్చింది. గాలి జనార్దన్ రెడ్డి చొరవ వల్లనే సుష్మా స్వరాజ్ లోకసభలో జగన్‌కు అనుకూలంగా మాట్లాడారనే ప్రచారం జరిగింది. అక్రమాలకు పాల్పడినవారిని సమర్థిస్తున్నారనే విమర్శల నుంచి తప్పుకోవడానికి ఆమె జగన్‌ను కలుసుకోవడానికి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications