చంద్రబాబుకు తెలంగాణ షాక్, విద్యార్థుల నినాదాలు

అప్రెంటిస్ రద్దు డిమాండ్ చేస్తూ ఇందిరా పార్కు వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. దీక్షా శిబిరానికి వచ్చిన చంద్రబాబు వారి పోరాటానికి సంఘీభావం తెలిపారు. విద్యా వ్యవస్థను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డ చంద్రబాబు విద్యార్థులు తక్కువగా ఉంటే పాఠశాలలు మూసివేస్తున్నారు తప్ప పని పిల్లలను పాఠశాలల్లో చేర్పించే ప్రయత్నం చేయకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సహా పలువురు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications