వికీలీక్స్: చిరంజీవి రాజకీయ ప్రవేశం వెనక

Chiranjeevi
హైదరాబాద్: చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి వికీలీక్స్ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. రాజకీయాల్లోకి రావాలా, వద్దా అని చిరంజీవి సందేహిస్తున్న సమయంలో ఓ అభిమాని ఆత్మహత్య చేసుకోవడం చిరంజీవి మనస్సును మార్చిందని అంటున్నారు. అమెరికా రాయబార కార్యాలయం పంపిన కేబుల్‌ను వికీలీక్స్ బయటపెట్టింది. బాలీవుడ్ గురించి ఆ కేబుల్‌లో ప్రస్తావిస్తూ చిరంజీవి రాజకీయ ప్రవేశం వెనక జరిగిన విషయాన్ని కూడా వెల్లడించింది.

2008 మార్చి 5వ తేదీ కేబుల్‌ను వికీలీక్స్ ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన బయటపెట్టింది. చిరంజీవి ఆ సమయంలో రాజకీయ ప్రవేశం గురించి అయోమయంలో ఉన్నారని, తన అభిమాని ఆత్మహత్యను ప్రస్తావించి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని చిరంజీవి చెప్పారని అది బయటపెట్టింది. చిరంజీవి రాజకీయాల్లోకి రావడం పట్ల జాప్యాన్ని జీర్ణించుకోలేక తాను అత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ అభిమాని సూసైడ్ నోట్‌లో రాశాడు. బాలీవుడ్‌కూ అండర్ వరల్డ్‌కూ మధ్య గల సంబంధాలపై కూడా వికీలీక్స్ బయటపెట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+