వైయస్‌ను కోర్టుకెందుకు లాగలేదు: కొండా సురేఖ

కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తి వేయాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెసు పార్టీకి తెలంగాణ ఇచ్చే ఉద్దేశ్యం ఉందా మొదట స్పష్టం చేయాలని ఆమె అడిగారు. ఒకవేళ తెలంగాణ ఇవ్వాలనే ఉద్దేశ్యం ఉంటే ఎప్పటి వరకు వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. సకల జనుల సమ్మెను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ కోసం సకల జనుల సమ్మెనే చిట్ట చివరి అవకాశమన్నారు. సమ్మెలో తాము కూడా పాల్గొంటామని చెప్పారు. తెలంగాణ కోసం పార్టీలన్నీ జెండాలు పక్కన పెట్టాలని కోరారు. ప్రస్తుతం తెలంగాణ మంత్రులు డైలామాలో ఉన్నారన్నారు. మంత్రులు విధులకు హాజరు కావడం బాధాకరం అన్నారు.












Click it and Unblock the Notifications