కరెన్సీ లారీ పట్టివేత, గాలి జనార్దన్ రెడ్డిదని అనుమానం

Anantapur Map
అనంతపురం: బళ్లారి నుంచి హైదరాబాదు వెళ్తున్న కరెన్సీ లారీని అనంతపురం పోలీసులు గురువారం సాయంత్రం పట్టుకున్నారు. లారీలో డబ్బులు తరలిస్తున్నారనే అనుమానంతో లారీని పట్టుకున్నారు. లారీలో దాదాపు 4 కోట్ల రూపాయలు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. లారీ కడప జిల్లాదని భావిస్తున్నారు. లారీ నెంబర్ 04-9009. ఆ డబ్బు కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిది కావచ్చునని అనుమానిస్తున్నారు. పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కడపకు చెందిన వెంకట్రామిరెడ్డిని, ప్రొద్దుటూరుకు చెందిన ఈశ్వర రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులకు పట్టుబడిన వెంకట్రామిరెడ్డి సిబిఐ కస్టడీలో ఉన్న ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి సోదరుడని వార్తలు వస్తున్నాయి. దీంతో లారీలో తరలిస్తున్న సొమ్ము ఒఎంసిదేనని భావిస్తున్నారు.

ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు లారీని పట్టుకున్నట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా బళ్లారి నుంచి వాహనాలపై పోలీసులు నిఘా వేశారు. బళ్లారి సరిహద్దుల్లో పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్ బైపాస్ రోడ్డు వద్ద కరెన్సీ ఉన్న లారీని పోలీసులు పట్టుకున్నారు. లారీ ఓబుళాపురం మైనింగ్‌కు సంబంధించిందని భావిస్తున్నారు. మూడు సంచుల్లో కరెన్సీ ఉంది. అయితే, సొమ్మును హైదరాబాదుకు కాకుండా కడపకు తరలిస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు తరలిస్తుండవచ్చునని కూడా అనుమానిస్తున్నారు. లారీలో డబ్బులు పెట్టిన విషయం తనకు తెలియదని డ్రైవర్ అంటున్నాడు.

కాగా, రాష్ట్ర మైనింగ్ శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్‌ను సిబిఐ అధికారులు హైదరాబాదులో గురువారం ఉదయం నుంచి విచారిస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు సోమశేఖర రెడ్డి గురువారం సిబిఐ ముందు హాజరయ్యారు. గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన కేసులోనే హైదరాబాదులోని సోమాజిగుడాలో గల నవయుగ కన్‌స్ట్రక్షన్ కంపెనీ కార్యాలయంలో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+