అంబటి రాంబాబుపై విరుచుకుపడుతున్న నేతలు

రాజకీయాల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం తగదని తెలుగుదేశం పార్టీ నేత ఎర్రన్నాయుడు అన్నారు. ఖమ్మం జిల్లాలో సిపిఎం పార్టీ నేతలు మయూరి సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. అంబటిని వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అంబటి రాంబాబు వ్యవహారాలు నిజమే అయిన పక్షంలో ఆయనను పార్టీ నుండి బహిష్కరిస్తామని విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల స్పష్టం చేశారు. ఈ విషయాన్ని వైయస్ విజయమ్మ, హోంమంత్రి సబితారెడ్డి దృష్టికి తీసుకు వెళతామన్నారు.
అయితే అంబటి రాంబాబు రాసలీలల వెనుక వైయస్సార్ కాంగ్రెసు పార్టీని దెబ్బతీసే కుట్ర ఉన్నదా ఆనే కోణంలో కూడా చూడాలన్నారు. అంబటిపై కుట్ర జరిగుతుందా అనే దృష్టితోనూ ఆలోచించాల్సి ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య సైతం అంబటి రాసలీలల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications