సకల జనుల సమ్మెకాదు, సకల కష్టాల సమ్మె: లగడపాటి

ప్రభుత్వం సహనం, శాంతితో వ్యవహరిస్తోందని, భావోద్వేగాల సమస్య కాబట్టి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు. త్వరలో సామరస్య వాతావరణం ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రైల్ రోకో వల్ల సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు. సకల జనుల సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్ప ప్రయోజనం ఏమీ లేదని కాంగ్రెసు గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు అన్నారు. తెలంగాణపై తుది నిర్ణయం తమ పార్టీ అధిష్టానానిదేనని ఆయన అన్నారు. తెలంగాణ అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదని ఆయన గుంటూరులో శనివారం ఉదయం మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications