చంద్రబాబు దెబ్బ: టిడిపి నుండి మరో ఎమ్మెల్యే అవుట్

అదే జిల్లాకు చెందిన కామారెడ్డి శాసనసభ్యుడు గంపా గోవర్ధన్ తాజాగా కెసిఆర్‌ను కలవడం ఆయన టిడిపిని వీడనున్న నేపథ్యంలో జిల్లాలో టిడిపి బలం పూర్తిగా తగ్గి పోయిందనే చెప్పవచ్చు. అయితే గంపా టిడిపిని వీడటం వెనుక తన నియోజకవర్గానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడమే అని తెలుస్తోంది. సోమవారం కామారెడ్డిలో తెలంగాణ కోసం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయన తీవ్రంగా కలత చెందారు. జిల్లాకు చెందిన తెలంగాణవాదులు సైతం ఆయనను నిలదీశారు. దీంతో ఆయన రెండు కళ్ల సిద్ధాంతం ప్రవచిస్తున్న టిడిపిని వీడతానని ఆయన అక్కడికక్కడే సోమవారం ప్రకటించారట. అన్నట్టుగానే ఆయన కెసిఆర్‌ను కలిసి తెలంగాణ తాను టిఆర్ఎస్‌లో చేరతానని చెప్పినట్లుగా తెలుస్తోంది.
పోచారం తర్వాత మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నాగర్ కర్నూల్ శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లారు. తన ఎమ్మెల్యే పదవికి ఆయన రెండుసార్లు రాజీనామా చేశారు. ఆయితే స్పీకర్ ఆయన రాజీనామాను ఆమోదించలేదు. అనంతరం నాగం జనార్ధన్ రెడ్డి వెంటే ఉంటూ వస్తున్న ఎమ్మెల్యేలు హరీశ్వర్ రెడ్డి, జోగు రామన్న, వేణుగోపాలాచారి తదితర ముగ్గురు ఎమ్మెల్యేలు టిడిపి రాజీనామా చేశారు. గంపా టిడిపికి దూరమైతే ఇప్పటి వరకు తెలంగాణ కోసం ఆ పార్టీని వీడిన ఎమ్మెల్యేల సంఖ్య ఆరుగురికి చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications