సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఎర్రబెల్లి డెడ్ లైన్

విద్యుత్ కోతపై ప్రభుత్వం నుండి మధ్యాహ్నం లోగా స్పష్టమైన వివరణ రాకపోతే విద్యుత్ సౌధను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ముఖ్యమంత్రి కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని అది సరికాదన్నారు. తెలంగాణలో జరుగుతున్న సకల జనుల సమ్మెకు రాజధానిలో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులు సైతం మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమ్మె వల్ల నష్ట పోయే వారిని బిక్షమెత్తైనా ఆదుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications