బొత్స సత్తిబాబు వర్సెస్ కిరణ్ కుమార్ రెడ్డి: మరో వివాదం

Botsa Satyanarayana-Kiran Kumar Reddy
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య తాజా వివాదం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి తీరుపై బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తనపై కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడమే ముఖ్యమంత్రిపై ఆయన ఆగ్రహానికి కారణమని చెబుతున్నారు. చిరంజీవిని వెంటేసుకుని బొత్స సత్యనారాయణ మితిమీరి వ్యవహారాలు నడుపుతున్నారని కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.

పార్టీ అధిష్టానం ముందు తన ప్రతిష్టను దిగజార్చాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని బొత్స సత్యనారాయణ మండిపడుతున్నట్లు తెలుస్తోంది. బిసిలు,త ఎస్‌సిలు పార్టీ దూరమైతే కష్టమని బొత్స సత్యనారాయణ భావిస్తున్నారని, వారిని నిలబెట్టుకునేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారని బొత్స వర్గం అంటోంది. ముఖ్యమంత్రి నివేదిక తప్పుల తడక అని ఆ వర్గం వాదిస్తోంది. విశాఖపట్నంలో ఇటీవల జరిగిన గర్జన సభకు హాజరు కావడానికి ముఖ్యమంత్రి నిరాకరించారని తెలుస్తోంది. అయితే, తాను వెళ్లకపోతే నష్టం తనకేనని, చిరంజీవి - బొత్స సత్యనారాయణ వీరవిహారం చేస్తారని భావించి తన మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+