శంకర రావు లేఖతో సబితకు షాక్, సిబిఐ దర్యాఫ్తు

P Shankar Rao-Sabitha Indra Reddy
హైదరాబాద్: హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణలపై మంత్రి శంకర రావు చేసిన ఆరోపణలను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. శంకర రావు సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవిలపై తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో వారిపై సిబిఐతో విచారణ చేయించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నర్సింహా రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. విచారణ చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. కాగా శంకర రావు గతంలో మోపిదేవి పైన, సోమవారం సబితా ఇంద్రారెడ్డి పైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

లంచం తీసుకొని ఎక్సైజ్ పోలీసు అధికారులను మోపిదేవి బదిలీలు చేశారని గతంలో ఆరోపించారు. ఇక మంగళవారం సబితారెడ్డి పైనా తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి సబితా రెడ్డి డబ్బులు తీసుకొని పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలలో సబిత తనయుడు, తమ్ముడుకి పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. సబితపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని లేదంటే వచ్చే నెల 2వ తారీఖున తాను తన పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు.

కాగా మంగళవారం శంకర రావు డిజిపికి లేఖ రాశారు. తనకు అదనపు భద్రత అవసరం లేదని ప్రస్తుతం ఉన్న భద్రతనే కొనసాగించాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. తన ప్రాణానికి ఎలాంటి ముప్పు లేదన్నారు. తనకు భద్రత ఎందుకు వద్దన్నానో కారణంగా తర్వాత చెబుతానని లేఖలో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+