రేపే తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేల రాజీనామా

Mothkupalli Narasimhulu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండుతో తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు రేపు బుధవారం రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. రాజీనామా లేఖలతో తాము రేపు ఉదయం పది గంటలకు శానససభకు వస్తామని, కాంగ్రెసు శాసనసభ్యులు కూడా రాజీనామాకు సిద్ధపడాలని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాజకీయ సంక్షోభం సృష్టించి తెలంగాణ సాధించడానికి మిగతా పార్టీల తెలంగాణ ప్రజాప్రతినిధులు సిద్ధపడాలని ఆయన పిలుపునిచ్చారు.

తమ పార్టీ శాసనసభ్యుడు గంప గోవర్దన్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును కలిసిన నేపథ్యంలో తెలుగుదేశం మరో తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యులను కెసిఆర్ బెదిరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తమ శాసనసభ్యులపై దాడులు జరిపించి, వారిని భయభ్రాంతులకు గురి చేసి తెరాసలో చేరేలా ఒత్తిడి పెడుతున్నారని ఆయన ఆరోపించారు. కెసిఆర్ తనను ఇబ్బందులు పెడుతున్నారని, ఇంటిపై దాడులు చేయిస్తున్నారని, గతంలో గంప గోవర్ధన్ పలుమార్లు తనతో చెప్పినట్లు ఆయన చెప్పారు. కెసిఆర్‌ను గోవర్ధన్ ఎందుకు కలిశారో తెలియదని, సంప్రదించాలని ప్రయత్నిస్తే అందుబాటులో లేరని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+