హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి కేసులో జానకి కొండపిని ప్రశ్నించిన సిబిఐ

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ గనుల కేసులో సీబీఐ అధికారులు మంగళవారం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జానకి కొండపిని ప్రశ్నించారు. స్వయంగా సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఆమెను ప్రశ్నించినట్లు తెలిసింది. జానకి కొండపి అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసినపుడు గాలి జనార్దన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఆమె రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సనత్ నగర్‌లోని పీసీబీ కార్యాలయానికి సీబీఐ అధికారులు వచ్చారు. జానకిని ఆమె చాంబర్‌లోనే ప్రశ్నించారు.

గాలి జనార్దన్ రెడ్డి గనుల్లో అక్రమాలు జరుగుతున్నప్పటికీ అటవీ శాఖ ఎందుకు పట్టించుకోలేదని, జయ కుమార్‌ను ఎనిమిదేళ్లకు పైగా అటవీశాఖలో ప్రధాన కార్యదర్శిగా ఎందుకు కొనసాగిస్తున్నారని సిబిఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. అవసరమైతే ఆమెను మరోసారి ప్రశ్నించే అవకాశముందని తెలుస్తోంది. అనంతపురం డీఎఫ్‌వోగా పని చేసిన కల్లోల్ బిశ్వాస్ అందించిన వివరాల ఆధారంగానే జానకిని ప్రశ్నించినట్లు సమాచారం. అక్రమ ఖనిజాన్ని ఎగుమతి చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన కారంపొడి మహేశ్ రెండోరోజున సీబీఐ విచారణకు హాజరయ్యారు. తానేమీ అక్రమాలకు పాల్పడలేదని, గాలితో కేవలం ట్రాన్స్‌పోర్టర్‌గానే సంబంధాలున్నాయని మహేశ్ మీడియాతో అన్నారు. కాగా మరిన్ని కీలక సాక్ష్యాల కోసం కేరళ, ముంబై, కోల్‌కతాలకు సీబీఐ బృందాలు వెళ్లాయి.

English summary
CBI questioned retired IAS officer Janaki Kondapi in Gali Janardhan Reddy's case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X