అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిటాల రవిని చంపించింది వైయస్సారే: చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
అనంతపురం: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం అనంతపురం జిల్లాలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో వైయస్ రాజశేఖర రెడ్డి హస్తం ఉందని ఆరోపణలు చేశారు. పరిటాల రవితో పాటు పలువురు టిడిపి నేతలను వైయస్ చంపించారని ఆరోపించారు. కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ శాసనసభ్యుడు గాలి జనార్ధన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ అక్రమాలలో వైయస్‌కూ భాగం ఉందన్నారు.

గాలిని పెంచి పోషించిన ఘనత వైయస్‌దే అన్నారు. గిరిజన దేవత సుంకులమ్మ ఆలయాన్ని కూల్చిన పాపంతోనే గాలి జనార్ధన్ రెడ్డి జైలు పాలయ్యారని విమర్శించారు. గాలి అరెస్టు వెనుక తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటం ఉందన్నారు. వైయస్ అండతో గాలి చెలరేగి పోయారని విమర్శించారు. ఆంధ్రా గనులు కూలగొట్టి కర్నాటకలో కోట్లు కూడబెట్టారన్నారు. వైయస్, గాలి కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. టిడిపిని భూస్థాపితం చేస్తానన్న గాలి జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఎవరూ భూస్థాపితం చేయలేరన్నారు.

రాష్ట్రంలోని ఇనుప ఖనిజాన్ని నిలువునా దోచుకున్నారన్నారు. సిబిఐ విచారణతో ఇప్పుడు అందరి బండారం బయట పడుతోందన్నారు. వైయస్ పెంచిపోషించిన దొంగల్లో గాలి ఒకరన్నారు. అవినీతి సొమ్ముతో వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎదిగారని ద్వజమెత్తారు. ఓబుళాపురం మైనింగ్ కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు. కాగా అంతకుముందు చంద్రబాబు అనంతలో టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఓబుళాపురం గనులలో ఏరియల్ సర్వే చేశారు.

English summary
TDP chief Chandrababu Naidu accused late YS Rajasekhar Reddy for Telugudesam leader Paritala Ravi murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X