హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైటెక్ సిటీ రోడ్డులో ఎమ్మెల్యే హరీష్ రావు అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు బుధవారం ఉదయం హైటెక్ సిటీ వెళ్లే రహదారిలో బైఠాయించి సాఫ్టువేర్ ఉద్యోగులు విధులకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఆయనతో సహా పలువురు తెలంగాణవాదులను పోలీసులు అరెస్టు చేశారు. సకల జనుల సమ్మెలో భాగంగా ఉద్యమంలో పాల్గొన్న స్వామి గౌడ్‌పై మంగళవారం జరిగిన దాడికి నిరసనగా ఆయన ఉద్యోగులు ఎవరూ విధులకు వెళ్లవద్దంటూ రోడ్డు పైనే బైఠాయించారు. దీంతో ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జాం అయింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ హైదరాబాదు పైనే మా దృష్టి అని చెప్పారు. అక్టోబరు రెండే వారంలో హైదరాబాదును దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ఉద్యమాన్ని అణచాలని చూస్తే మరింత ఉధృతం చేస్తామన్నారు. కావాలనే ఉద్యోగులపై పోలీసులు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రెచ్చగొడితే తీవ్ర పరిణామాలుంటాయన్నారు.

తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ బుధవారం ఉదయం తెలంగాణ విద్యావంతుల వేదిక బస్సుయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమ్మెతో తెలంగాణ ప్రజలకే నష్టమని ఓ దుష్ప్రచారం జరుగుతోందన్నారు. అది సరికాదన్నారు. ఉద్యమ నాయకత్వాన్ని దెబ్బతీసేందుకే భౌతిక దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టి నాయకత్వాన్ని విడదీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత స్వామి గౌడ్ దాడికి నిరసనగా బుధవారం తెలంగాణ అంతటా రాస్తారోకోలు, ధర్నాలు చేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఉద్యమం చాలా శాంతియుతంగా జరుగుతోందని దీనిని ఆంధ్రా నేతలు అర్థం చేసుకొని ప్రజాస్వామ్యయుతంగా మసలుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సకల జనుల సమ్మె బుధవారం పదహారవ రోజుకు చేరుకుంది. ఆర్టీసి సమ్మె పదోరోజుకు, మెడికల్ ఐకాస సమ్మె ఏడో రోజుకు చేరుకుంది. తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కాగా స్వామి గౌడ్‌పై దాడికి నిరసనగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రాస్తారోకో చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోయాయి. మరోవైపు వనస్థలిపురంలో మంగళవారం జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకొని భారీగా ఆర్ఎఎఫ్ దళాలను మోహరించారు. సచివాలయం వెళ్లే ఉద్యోగులను తెలంగాణ ఆందోళనకారులు అడ్డుకోకుండా ఉండటానికి బలగాలను మోహరించారు.

English summary
TRS MLA Harish Rao sat on hitech city road today to obstruct software employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X