హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై రాహుల్ గాంధీ కమిటీ, సోనియా ఆలోచన?

By Pratap
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం కచ్చితమైన నిర్ణయం తీసుకోలేని చిక్కుల్లో పడింది. తమ తమ డిమాండ్లపై పార్టీలోని సీమాంధ్ర, తెలంగాణ నాయకులు గట్టిగా పట్టుబడుతున్న నేపథ్యంలో ఏం చేయాలో తోచని అయోమయ స్థితిలో పడింది. సమైక్యాంధ్ర కావాలని సీమాంధ్ర నాయకులు పట్టుపడుతుండగా, తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని తెలంగాణ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తన తనయుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఓ కమిటీని వేసే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.

తెలంగాణపై పార్టీపరంగా ముందు నిర్ణయం తీసుకుంటే తప్ప కేంద్ర ప్రభుత్వం తేల్చలేని స్థితిలో పడింది. ఈ స్థితిలో పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ఇరు ప్రాంతాల నాయకులతో సంప్రదింపులు జరిపారు. ఆయన తన నివేదికను అక్టోబర్ 10 లేదా 12వ తేదీన సోనియా గాంధీకి సమర్పించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఆయన తెలంగాణపై మూడు సిఫార్సులు చేయనున్నట్లు చెబుతున్నారు. అందులో ఒకటి - హైదరాబాదును మినహాయించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం. అయితే, దీనికి తెలంగాణవాదులు అంగీకరించడం లేదు. అయితే సీమాంధ్రులు దీనికి అంగీకరించవచ్చు. రెండోది - పదేళ్లపాటు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం. దీనికి కాంగ్రెసు తెలంగాణ నాయకులు అంగీకరిస్తున్నారు. కానీ సీమాంధ్ర నాయకులకు ఇది ఒప్పుకోలు కాకపోవచ్చునని అంటున్నారు. మూడోది - తెలంగాణకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం. అయితే దీనికి తెలంగాణవాదులు అంగీకరించడం లేదు.

ఆజాద్ చేస్తారని చెబుతున్న మూడు సిఫార్సులు కూడా సమస్యను పరిష్కరించేట్లు లేవని అంటున్నారు. ఈ స్థితిలో రాహుల్ గాంధీ నేతృత్వంలో మరో కమిటీని వేయవచ్చునని అంటున్నారు. సమస్యకు ఒకటి కన్నా ఎక్కువ ప్రత్యామ్నాయాలు పరిష్కారం కావనేది అర్థమవుతూనే ఉన్నది. ఈ పరిస్థితిలో ఒకే ప్రత్యామ్నాయంతో రావడానికి రాహుల్ గాంధీకి సమస్యను అప్పగించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

English summary
Sonia Gandhi may constitute another committee headed by Rahul Gandhi to come out with the best solution on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X