హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోదండరామ్ సహా తెలంగాణ కీలక నేతల అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram-KT Rama Rao
హైదరాబాద్: తెలంగాణలో అరెస్టుల పర్వం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు, ఈటెల రాజేందర్, సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ చైర్మన్ ఆచార్య కోదండరామ్‌లను పోలీసులు బుధవారం వేరు వేరు చోట్ల అరెస్టు చేశారు. మంగళవారం ఉద్యోగ సంఘాల నేత స్వామి గౌడ్‌పై పోలీసుల దాడికి నిరసనగా తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు తెరాస నేతలు వివిధ చోట్ల రాస్తారోకోకు దిగారు. హరీష్ రావును హైటెక్ సిటీ వద్ద ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కోదండరాంను ప్యారడైజ్ వద్ద, కెటిఆర్‌ను మెట్టుగూడ వద్ద, ఈటెల రాజేందర్‌ను తిరుమలగిరిలో పోలీసులు అరెస్టు చేశారు.

అరెస్టు అయిన సమయంలో కెటిఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై నిప్పులు గక్కారు. ఆందోళనలు ప్రజాస్వామ్య భారతంలో భాగమని, ఆందోళన చేయడం ప్రజల హక్కని దానిని అడ్డుకోవడం సరికాదన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సైతం ఆందోళన చేశారని అప్పుడు ఆయనను అరెస్టు చేయని పోలీసులు ఇప్పుడు తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు తదితరులను అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే వాస్తవ నివేదికలు పంపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అణిచివేత చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు. ప్రజాశక్తి ముందు అందరూ తలవంచాల్సిందేనన్నారు. కెటిఆర్ సొమ్మసిల్లి పడిపోయారు.

సచివాలయం వద్ద ఆందోళన చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులోని ఆర్టీసి క్రాస్ రోడ్డు వద్ద తెరాస నేత నాయని నర్సింహారెడ్డిని, సిపిఐ (ఎంఎల్) న్యూడెమొక్రసీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ ఉద్యమకారుల అరెస్టులు ఊపందుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.

కాగా నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చేదు అనుభవం ఎదురయింది. పలువురు తెలంగాణవాదులు కోమటిరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పలువురిని అరెస్టు చేశారు.

English summary
Police arrested TRS MLAs KT Rama Rao, Etela Rajendar and Telangana Political JAC chairman Kodandaram today. KTR lashes out at CM Kiran Kumar Reddy for arrests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X