హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదును వదిలే ప్రసక్తే లేదు: టిజి వెంకటేష్

By Pratap
|
Google Oneindia TeluguNews

TG Venkatesh
కర్నూలు: రాయల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనపై రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ స్పందించారు. తాము హైదరాబాదును వదిలే ప్రసక్తి లేదని, మీరు ఎలా అర్థం చేసుకున్నా సరే అని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమకు నష్టపరిహారం చెల్లించకుండా హైదరాబాదును వదిలే ప్రసక్తి లేదని వెంటనే అన్నారు. తామంటే కర్నూలు జిల్లావాళ్లమని ఆయన అన్నారు. కర్నూలును రాజధానిగా కోల్పోవడం వల్ల తాము ఇప్పటికే నష్టపోయామని ఆయన అన్నారు. తమకు 2 లక్షల కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తే హైదరాబాదును వదిలేస్తామని ఆయన అన్నారు.

తాము సమైక్యంధ్రకే మద్దతిస్తున్నామని, కర్నూలును రెండో రాజధానిగా చేయాలని కోరుతున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన చేసే ముందు తమ ప్రాంత ప్రజల మనోగతాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు. తమ ప్రాంతానికి నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. రాయలసీమ ఇప్పటికే ముక్కలయిందని, ఇప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాలను వేరు చేస్తామనడం సరి కాదని ఆయన అన్నారు.

English summary
Minister from Rayalaseema said that they will not leave Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X