డాక్టర్ నరేష్ రెడ్డి తుపాకి కాల్పుల్లో దొంగ మృతి

వంట మనిషి కేకలకు నిద్ర లేచిన నరేష్ రెడ్డి వచ్చి చూసే సరికి దొంగలు గోడ దూకి పారిపోయే ప్రయత్నంలో ఉన్నారు. దాంతో నరేష్ తన వద్ద ఉన్న రివాల్వర్‌తో గాలిలోకి కాల్పులు జరిపారు. అయినా దొంగలు తమ ప్రయత్నాలను మానుకోలేదు. దీంతో నేరుగా వారిపైకి గురి పెట్టి ఆయన కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మురళి అనే దొంగ మరణించాడు. అలికిడికి నిద్ర లేచిన ఇతర ఇళ్లలోని వారు శివను పట్టుకున్నారు. అతన్ని పోలీసులకు అప్పగించారు. సంఘటనా స్థలాన్ని హైదరాబాదు పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ సందర్శించారు. ఆత్మరక్షణ కోసమే నరేష్ రెడ్డి కాల్పులు జరిపారని ఆయన చెప్పారు. వంటమనిషి సమయస్ఫూర్తితో వ్యవహరించాడని ఆయన ప్రశంసించారు. దొంగల నేపథ్యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications