తెలంగాణ కోసం త్వరలో జైపాల్ రెడ్డి కార్యాచరణ

తెలంగాణ ప్రజల కోసం రాజీనామాలు చేయకుంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పట్టడం లేదా అని వారిని కాపాడుకుంటారా లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు జాప్యమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అయితే తాను త్వరలో కార్యాచరణ ప్రకటిస్తానని తమతో జైపాల్ రెడ్డి చెప్పినట్లుగా జెఏసి నేతలు వివరించారు. జెఏసి నేతలు జైపాల్ రాజీనామాకు డిమాండ్ చేయడంతో కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది.
మరోవైపు హైదరాబాదులోని తెలంగాణ లాయర్ల ఐక్య కార్యాచరణ సమితి ట్యాంక్ బండు వద్ద ఆందోళన చేపట్టింది. తెలంగాణ ప్రకటించే బుద్ధిని ప్రభుత్వానికి కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ బుద్ద విగ్రహానికి లేఖను ఇచ్చారు. జైపాల్ రెడ్డి, మంత్రి జానా రెడ్డిలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సకల జనుల సమ్మెకు మద్దతు ప్రకటించాలన్నారు. ఆందోళనకు దిగిన లాయర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications