ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై కోదండరామ్ మండిపాటు

నిరుడు ఎంత విద్యుత్ కొనుగోలు చేశారో, ఇప్పుడెంత కొన్నారో ముఖ్యమంత్రి వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ప్రభుత్వం అమ్ముతోందని ఆయన ఆరోపించారు. రైతుల సమస్యపై సీఎంకు చిత్తశుద్ధి ఉంటే విద్యుత్ సమస్యపై ప్రధానమంత్రితో మాట్లాడేవారని ఆయన అన్నారు. జల విద్యుత్ ఉత్పతిపై ముఖ్యమంత్రితో బహిరంగ చర్చకు తాను సిద్దంగా ఉన్నాని సవాల్ చేశారు. కరెంట్ కోతలపై రైతులు తెలంగాణ కాంగ్రెస్ నేతలను నిలదీయాలని కోదండరామ్ సూచించారు. సమ్మెపై ముందుగానే చెప్పినా ఎందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేదని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications