బొత్సపై చెప్పులు విసిరిన జగన్ పార్టీ కార్యకర్తలు

Botsa Satyanarayana
అనంతపురం: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు సోమవారం అనంతపురం జిల్లా పర్యటనలో చేదు అనుభవం ఎదురయింది. జిల్లాలోని కదిరి సభలో బొత్స మాట్లాడుతుండగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌పై చెప్పులు విసిరారు. అయితే ఆ చెప్పులు బొత్సకు తగల లేదు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బొత్స పైకి చెప్పులు విసిరిన వారిని అదుపులోకి తీసుకున్నారు. బొత్స జిల్లాకు రాగానే మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి, మంత్రి రఘువీరా రెడ్డి మధ్య గ్రూపు విభేదాలు మరోసారి బయట పడ్డ విషయం తెలిసిందే.

వైయస్ జగన్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఆదివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ పాల్గొన్న ఇందిర జల ప్రభ కార్యక్రమంలోనూ నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్న సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు వాకి ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం, కుర్చీలు ఎక్కడికి అక్కడ విసిరి వేయడం చేసిన విషయం తెలిసిందే. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+