వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌కు సీమాంధ్ర టిడిపి నేత సోమిరెడ్డి ప్రశ్నలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

somireddy chandramohan reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం ప్రశ్నల వర్షం కురిపించారు. సకల జనుల సమ్మెతో తెలంగాణ ప్రజలు కష్టాలు పడటంపై ఆయన తీవ్రంగా స్పందించారు. సమ్మె వల్ల కెసిఆర్ లాంటి వారు ఎలాంటి ఇబ్బందులు పడటం లేదన్నారు. సామాన్యులను మాత్రం ఇబ్బందుల పాల్జేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కెసిఆర్ కుటుంబం మొత్తం ఆడి లాంటి ఖరీదైన ఏసీ కార్లలో తిరుగుతుంటే తెలంగాణ ప్రజలు ఎర్రబస్సుల్లో కూడా ప్రయాణించ వద్దా అని ప్రశ్నించారు. కార్పొరేట్ స్కూళ్లలో ఏసీ రూముల్లో ఆయన మనవళ్లు, మనవరాళ్లు చదువుతుంటే పేద పిల్లలు వీధి బడుల్లో కూడా చదువుకోవద్దా అని, కెసిఆర్ ఆదేశాల మేరకే బొగ్గు గనుల్లో తవ్వకాలు నిలిచిపోయి కరెంటు కోత పడి పైర్లు ఎండి పోవడంతో రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.

ఉద్యమం పేరుతో పత్రిక, చానెల్ ఆటంకం లేకుండా నడుస్తున్నాయి. కలెక్షన్స్ కూడాయథేచ్ఛగా కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఐదు మాసాల క్రితం ఢిల్లీలోని కేకే ఇంట్లో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలన్న పని ఎంత వరకొచ్చిందన్నారు. 15 రోజుల్లో తెలంగాణ వస్తుందని సిగ్నల్స్ వచ్చాయని నెల క్రితం అన్నారు. అది ఎక్కడి వరకు వచ్చిందన్నారు. 34 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినా నిత్యం టిడిపిని ఆడిపోసుకునే మీరు తెలంగాణను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించే ఎంఐఎం పార్టీ ఓవైసీని, మనసా, వాచా ప్రత్యేక వాదాన్ని వ్యతిరేకించే దానం, ముఖేష్‌లను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్‌ను పల్లెత్తు మాట ఎందుకనరని ప్రశ్నించారు.

నిత్యం కెసిఆర్ కేకే, జానాలతో మంతనాలు జరుపుతారని విమర్శించారు. కెసిఆర్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు విమానంలో తిరుగుతుంటే ఇక్కడి ప్రజలు రైళ్లలో కూడా ప్రయాణించకూడదా అని, తెలంగాణ వస్తే దళితుడు సిఎం, ముస్లిం డిప్యూటీ సిఎం అంటారు. కానీ పార్టీలో కెసిఆర్ కు లెఫ్ట్ కేటీఆర్, రైట్ కోదండరాం, ఫ్రంట్ కవిత, బ్యాక్ హరీష్ ఉంటారు. పై నలుగురిని దాటుకుని ఏ దళితుడైనా, ముస్లిం అయినా మీ పక్కన నిలబడగలరా అని ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజల కష్టాలను, నష్టాలను పణంగా పెట్టి, కాంగ్రెస్‌తో కలిసి రాజకీయ ప్రయోజనాలు పొందడమే మీ లక్ష్యమా అని విమర్శించారు.

English summary
Seemandhra TDP MLA Somireddy Chandramohan Reddy questioned TRS chief K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X