తెలంగాణ కోసం హోర్డింగ్ ఎక్కి యువకుడి హల్‌చల్

విష్ణును కిందకు దింపడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అతను మాత్రం ససేమీరా అన్నాడు. ఇతను గత సంవత్సరం కూడా మాదాపూర్‌లో సెల్ టవర్ ఎక్కి హంగామా చేశాడు. కాగా మూసాపేట్ చౌరస్తా వద్ద లిక్కర్ యాజమాన్యం ఆందోళనకు దిగింది. సమ్మె కాలంలో లిక్కర్ పై పన్నును తొలగించాలని డిమాండ్ చేసింది. సమ్మె కొనసాగించాలో లేదో నిర్ణయం ప్రకటిస్తామని ఎన్ఎంయు నేత మహమూద్ ప్రకటించారు. సమ్మె విరమించేందుకు ఎన్ఎంయు అగ్రనేతలు సిద్ధంగా ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించేది లేదని తెలంగాణ ఎన్ఎంయు నేతలు అంటున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఎన్ఎంయులో విభేదాలు వచ్చినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications