ఎన్‌ఎంయులో చిచ్చు పెట్టిన బొత్స, సమ్మెపై విభేదాలు

మెజారిటీ అభిప్రాయం మేరకు తాము సమ్మెను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు మహమూద్, నాగేశ్వర రావు మీడియా ప్రతినిధులతో చెప్పారు. వీరి నిర్ణయాన్ని తెలంగాణకు చెందిన ఎన్ఎంయు సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్ఎంయు తెలంగాణ ఫోరం కార్యకర్తలు మంత్రి బొత్స సత్యనారాయణ క్వార్టర్ వద్ద ధర్నాకు దిగారు. దానికి ప్రతిగా తాము తమ తెలంగాణ ఫోరాన్ని రద్దు చేస్తున్నట్లు మహమూద్ చెప్పారు. తాము ఎన్ఎంయు నుంచి బయటకు వచ్చి, సమ్మెను కొనసాగిస్తామని ఎన్ఎంయు తెలంగాణ ఫోరం నేత అశ్వత్థామ చెప్పారు. సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవు దినాలుగా పరిగణించడానికి, కేసును ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం అంగీకరించిందని మహమూద్ చెప్పారు.












Click it and Unblock the Notifications