తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం డైలమా: ముఖ్యమంత్రి

విద్యాసంస్థలు మూత పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రవాణా, విద్యత్తు సమస్యలు కూడా తలెత్తకుండా వ్యవహరించాల్సి ఉందని ఆయన అన్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, పితాని సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ కూడా ముఖ్యమంత్రిని వేర్వేరుగా కలిశారు. ఏదో ఒకటి త్వరగా చెప్పాలని తాను అధిష్టానానికి సూచించానని, అయితే ఆ విషయంపై అధిష్టానం తనకు ఏమీ చెప్పలేదని ఆయన అన్నారు. తెలంగాణపై ఏదో ఒకటి తేల్చకుండా సమ్మె విరమించాలని కోరడం వల్ల ప్రయోజనం ఉండదని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications