జూబ్లీ బస్ స్టేషన్లో జెఏసి చైర్మన్ కోదండరాం అరెస్టు

నేతలను అరెస్టు చేయడంతో ఆర్టీసి కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో జూబ్లీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా అంతకుముందు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో చర్చల అనంతరం ఎన్ఎంయు నేతలు మహమూద్, నాగేశ్వర రావు సమ్మెకు కొంత విరామం ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సమ్మె విరమణ ప్రకటనపై తెలంగాణవ్యాప్తంగా పది జిల్లాల్లోని ఆర్టీసీ కార్మికులు మండిపడ్డారు. ఆర్టీసీ డిపోల వద్ద వారి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ప్రభుత్వానికి అమ్ముడుపోయి సమ్మె విరమించారని విమర్శించారు.












Click it and Unblock the Notifications