తెలంగాణపై ఈ రోజు ప్రకటన లేనట్లే, జాతీయ పార్టీలతో చర్చలు

తెలంగాణపై సోమవారం కాంగ్రెసు నాయకుడు చిరంజీవి, ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరితో కాంగ్రెసు మినీ కోర్ కమిటీ చర్చలు జరిపింది. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుంది. ఆ చర్చల తర్వాత ఆజాద్ మీడియాతో మాట్లాడారు. పార్టీ ముఖ్య నాయకులతో చర్చలు పూర్తయ్యాయని, మూడో విడతగా జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలతో చర్చలు జరపాల్సి ఉందని ఆయన చెప్పారు. దీన్ని బట్టి కూడా కాంగ్రెసు పార్టీ సంప్రదింపుల పేరుతో తెలంగాణపై నిర్ణయం వెలువరించే విషయంలో మరింత సమయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications