సమ్మె నుండి ఎవరికీ మినహాయింపు లేదు: కోదండరామ్

సకల జనుల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కొందరు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు ఇది కీలక సమయమని ఇలాంటి సమయంలో అందరూ సహకరించాలని కోరారు. తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరో నాలుగైదు రోజులు ఓపిక పట్టండన్నారు. 15న జెఏసి విస్తృతస్థాయి సమావేశం ఉంటుందని సమ్మెపై సమీక్షిస్తామని చెప్పారు. ఆర్టీసి సమ్మె కూడా కొనసాగుతుందన్నారు. తెలంగాణ సాకార దశకు చేరుకున్నామని ఈ సమయంలో వెనక్కి పోతే ఆత్మహత్య సాదృశ్యమే అన్నారు. ప్రభుత్వం అరెస్టు చేసినా ఉద్యమం ఆగదన్నారు. 12, 13, 14న తెలంగాణలోని ప్రతి పల్లె రైలు పట్టాల పైకి రావాలన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు సకల జనుల సమ్మె కొనసాగుతుందని తెలంగాణ ప్రజా ఫ్రంట్ చైర్మన్ గద్దర్ వేరుగా అన్నారు. కొందరు నేతలు కుట్రతో సమ్మెను దెబ్బ తీయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసి నేతల సమ్మె విరమణ ప్రకటన నమ్మొద్దన్నారు.












Click it and Unblock the Notifications