శ్రీలక్ష్మి ఇంట్లో ఏమీ దొరకలేదు: కోర్టుకు సిబిఐ నివేదిక

కాగా, గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమ తవ్వకాల కేసులో మరో ఐఎఎస్ అధికారి, గనుల శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రాజగోపాల్‌ను సిబిఐ అధికారులు పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన అరెస్టు జరగవచ్చునని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన సోమవారం ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి ప్రయత్నించారని చెబుతున్నారు. కోర్టు సమయం మించిపోవడంతో సోమవారం అది సాధ్యం కాలేదు. రేపు మంగళవారం ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ అధికారులు సోమవారం వాన్‌పిక్ భూముల లావాదేవీలపై ప్రకాశం జిల్లా దేవరంపాడులో విచారణ జరిపారు. భూముల కొనుగోళ్లు, ప్రభుత్వ భూముల కేటాయింపు రికార్డులను సిబిఐ అధికారులు పరిశీలించారు. బినామీ లబ్ధిదారుల వివరాలను సేకరించారు.












Click it and Unblock the Notifications