తెలంగాణపై ఇన్నాళ్లు ఏం చేశారు: వెంకయ్యనాయుడు

తెలంగాణ కోసమంటూ కొందరు ప్రజాప్రతినిధులు రెండుసార్లు రాజీనామాలు చేయడం విచిత్రమన్నారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిందన్నారు. మంత్రులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, పలువురు మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైనే ఆరోపణలు గుప్పిస్తున్నారన్నారు. గ్రామాల్లో విద్యుత్ లేక సాగు కుంటుపడి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం నడుచుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు రాష్ట్రపతి పాలనకు అనుకూలంగా ఉన్నాయని అయితే భాజపా స్వతహాగా దానికి వ్యతిరేకమన్నారు.
విద్యుత్ కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయాలు ఆలోచించడం లేదన్నారు. పాలన చూడాల్సిన మంత్రివర్గమే సమావేశం కాలేని పరిస్థితిలో ఉందన్నారు. ఎల్‌కె అద్వానీ చేపట్టిన జన చైతన్య రథయాత్ర స్వపరిపాలన, స్వచ్ఛమైన రాజనీతి కోసం ఉద్దేశించినదన్నారు. ఈ రథయాత్ర చరిత్రలో ముఖ్యమైన ఘట్టంగా మిగిలి పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications