న్యాయం అడిగినందుకే నాపై దొంగ కేసు: వైయస్ జగన్

పిఎస్‌లో ఒక్క పోలీసు అధికారి లేనప్పుడు ఎవరి విధులకు భంగం కలిగించామని ఆయన ప్రశ్నించారు. ఎంపీని అయిన తన పైనే దొంగ కేసులు పెడితే ఈ వ్యవస్థ ఎప్పుడు బాగుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు అమాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. పోలీసులు ఉన్నది ప్రజా సేవకన్నారు. న్యాయం చేయాలని అడిగినందుకే తనపై కేసు పెట్టారని విమర్శించారు. తమ ధర్నాకు సంబంధించిన విజువల్స్ తీసుకొని అన్ని మీడియా ఛానళ్లకు వెళతామని అలాగే హెచ్చార్సీని కూడా ఆశ్రయిస్తామని చెప్పారు. తాము పిఎస్ ముందు ఏం చేశామో మీడియాకు తెలుసన్నారు.












Click it and Unblock the Notifications